సినీ నటుడు అలీ పొలిటికల్ ఎంట్రీకి ఫిక్స్

సినీ నటుడు అలీ రాజకీయ పయనం ఎటువైపు అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలతో వరుసగా భేటీ అవుతున్నాడు. పది రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల అధినేతలతో మంతనాలు జరిపాడు. వాస్తవానికి అలీ గత ఎన్నికల సమయంలోనే టీడీపీ నుంచి టికెట్ ఆశించాడు. తన స్వస్థలం కావడంతో రాజమహేంద్రవరం నుంచి గానీ, ముస్లింలు అధికంగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ పోటీ చేయాలని భావించాడు. అయితే, పొత్తుల్లో భాగంగా రాజమహేంద్రవరం సిటీ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన టీడీపీ అధినేత.. గుంటూరు తూర్పును మద్దాలి గిరిధరరావుకు కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో అలీకి పోటీ చేయడం కుదరలేదు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ఇది రెండోసారి.

టీడీపీలో చేరికపై చర్చించేందుకే ఆయన చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి సన్నిహితుడైన అలీ…గతంలో జనసేన టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.అయితే ఇటీవల ఆయన పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అలీ…టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అలీ ఆశిస్తున్న టిక్కెట్‌ను ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో ఆయన టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అలీ ఇటీవలకాలంలో రెండోసారి చంద్రబాబుతో భేటీకావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.టీడీపీ తరఫున అలీ గుంటూరు నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారైనా పోటీ చేయాలనే ఆలోచనతో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం అలీ.. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయనకు సీఎం టికెట్ హామీ కూడా ఇచ్చారట.కొద్దిరోజుల క్రితం చంద్రబాబును కలిసిన అలీ.. తాజాగా మరోసారి ఆయనతో భేటీ అయ్యాడు. ఇందుకోసం అలీ ఆదివారం ఉదయం అమరావతిలోని సీఎం నివాసానికి వెళ్లాడు. ఇద్దరూ దాదాపు 15 నిమిషాల పాటూ సమావేశమయ్యారు.

ఈ భేటీలో తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉన్నానని, ఎలాగైనా ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించాలని కూడా అడిగినట్లు సమాచారం. దీనికి టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అలీ కోరిక మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్నే కేటాయించబోతున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ముస్తఫా షేక్.. టీడీపీ అభ్యర్థి గిరిధర్ రావుపై మూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అందుకే ఈ స్థానాన్ని టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే దీనిని అలీకి కేటాయించాలని చూస్తున్నట్లు తెలిసింది. సినీ గ్లామర్‌కు తోడు, ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చనే కోణంలో కూడా ఆయన ఆలోచించినట్లు వినికిడి. మొత్తానికి అలీ పొలిటికల్ ఎంట్రీ ఇప్పటికైనా ఫిక్స్ అయిందా..? లేక ఇది కూడా ప్రచారమేనా తెలియాలిఈ విషయంలో ఒక క్లారిటీ వస్తే త్వరలోనే ఆయన టీడీపీలో తీర్థంపుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది.
Tags: comedian ali, political entry, janasena, ysrcp party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *