ముగిసిన పరిషత్ రెండో దశ.. మండుటెండలోనూ ఓటెత్తిన జనం

తెలంగాణలో రెండో విడత పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 179 జెడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. 179 జడ్పీటీసీ స్థానాలకు 805 మంది అభ్యర్థులు పోటీ పడగా.. 1850 ఎంపీటీసీ స్థానాలకు 6 వేల మందికిపైగా అభ్యర్థులు పోటీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియగా.. మావోల ప్రాబల్యం ఉన్న 218 స్థానాల్లో ఓ గంట ముందే పోలింగ్‌ ముగిసింది. 

ఎండలు మండుతున్నా ఓటేసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో రెండో దశలో 77.63 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 84.15 శాతం పోలింగ్ జరగ్గా.. నల్గొండలో 82.56 శాతం, రంగారెడ్డిలో 80.47 శాతం, ఖమ్మంలో 82.05 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ములుగులో తక్కువగా 69.89 శాతం పోలింగ్ జరిగింది. 
తుది విడత పరిషత్‌ ఎన్నికలు మే 14న జరగనున్నాయి. లోక్ సభ ఫలితాలు మే 23న వెలువడనుండగా.. మే 27న పరిషత్ ఫలితాలను ప్రకటిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *