బిగ్ జోక్ :కాంగ్రెస్ లో చేరిక వార్తలపై హరీష్ రావు

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు తన్నీరు హరీష్ రావు ను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్స్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి గ్రామంలో బుధవారం నాడు పరిషత్ ప్రచారం నిర్వహించిన సందర్భంగా.. హరీష్ రావును ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తమతో టచ్ లో ఉన్నారనీ.. TRS పార్టీకి త్వరలోనే ఆయన గండికొడతారని  TRS ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని అన్నారు. హరీష్ రావు టైమ్ కోసం ఎదురుచూస్తున్నారని బొమ్మలరామారం ప్రచారంలో అన్నారు రాజగోపాల్ రెడ్డి.

దీనిపై హరీష్ రావు సోషల్ మీడియాలో స్పందించారు. ఒకే మాటతో వాటిని తప్పుపట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్పిన మాటలు.. బిగ్ జోక్ అన్నారు.

హరీష్ రావు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపైనే ఆశలు పెట్టుకున్నారని కొందరన్నారు. హరీష్ రావు టీఆర్ఎస్ ను ఎప్పుడు వీడుతాడా అన్నదానిపైనే కాంగ్రెస్ కు ఎక్కువ దృష్టి ఉందని సెటైర్లు వేశారు కొందరు. బొమ్మల రామారంలో సైకో శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నాడని ఇంకొందరు కామెడీ చేశారు. హరీష్ రావును టీఆర్ఎస్ లో నిర్లక్ష్యం చేశారనీ.. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన టైమ్ వచ్చిందని కొందరంటే… ఫ్యూచర్ లో ఎవరు గెలవాలన్నా హరీష్ పేరు వాడుకోవాల్సిందేనని మరికొందరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *