దసరా కు ముందె సైరా …రాం చరణ్ నిర్ణయం

ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని ప్రెస్టీజియస్ మూవీలో నటిస్తున్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంతో మన ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సైరా సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకొన్న నేపథ్యంలో సినిమా దసరాకు వస్తుందా? అని సందేహాలు రేకెత్తాయి. అయితే అలాంటి సందేహాలకు ఝలక్ ఇస్తూ రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తున్నట్టు సమాచారం.

చివరిదశలో సైరా షూటింగ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రంలోని హై వోల్టేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ ఫినిష్ చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

అక్టోబర్ 2నే విడుదల

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఈ సినిమాను దసరాకు ముందుగానే అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంలో వేగం పెంచేశారని తెలుస్తోంది. ప్లాన్ కంటే ముందే చిరంజీవి మూవీ చిరంజీవి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసమే రామ్ చరణ్ ఇలా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అతిత్వరలో దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అనుకున్నదానికంటే ముందే సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవిని చూసి ఎంజాయ్ చేయొచ్చన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *