అమ్మగారి తరపు బంధువులతో ఎన్టీఆర్

ఈ జనరేషన్ టాప్ లీగ్ స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.  నందమూరి హరికృష్ణ కుమారుడిగా సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.  నాన్నగారివైపు కుటుంబం అటు సినిమా పరంగానూ.. ఇటు రాజకీయంగానూ పేరున్నది.  అయితే అమ్మగారు షాలిని వైపు బంధువుల గురించి మనకు పెద్దగా తెలియదు.  ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్ళినప్పుడు వారిని కలుస్తాడని వార్తలు వస్తుంటాయి కానీ ఇంతవరకూ వారికి సంబంధించిన ఫోటోలేవీ బయటకు రాలేదు.
తాజాగా ఎన్టీఆర్ కుటుంబం.. అమ్మగారు షాలిని తరఫు బంధువులతో కలిసిన సందర్భంగా తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి.  ఈ ఫోటోలలో ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి.. పిల్లలు అభయ్ రామ్.. భార్గవ్ రామ్ లతో పాటు షాలిని గారు కూడా ఉన్నారు.  ఇక వీరితో పాటు పదిహేను మందికి పైగా చుట్టాలు కూడా ఉన్నారు. ఈ ఫోటో బయటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
  ఎన్టీఆర్ ప్రస్తుతం గాయం కారణంగా RRR షూటింగ్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో కూడా చేతికి కట్టు అలానే ఉంది. ఎన్టీఆర్ దాదాపుగా గాయం నుండి కోలుకున్నాడని. త్వరలోనే RRR షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. అయితే అంతలోపు హాలిడే ని ఈ విధంగా బంధువులను కలిసి సమయం గడిపేందుకు ఉపయోగించుకున్నాడు.   ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఇలా కలవడంతో బంధువులు ఫుల్లుగా హ్యాపీ అయి ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *