వరుణ్ తేజ్ హీరోగా భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న అల్లు బాబీ

గతంలో నిర్మాణ పర్యవేక్షణ చేసిన అల్లు బాబీ
ఇప్పుడు నిర్మాతగా రంగంలోకి
భారీ బడ్జెట్ తో వరుణ్ తేజ్ తో మూవీ

అల్లు అరవింద్ తనయుల్లో అల్లు అర్జున్ హీరోగా స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. అల్లు శిరీశ్ హీరోగా ఒక్కో మెట్టు పైకెక్కడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ల సోదరుడైన అల్లు బాబీ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకూ ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతూ వచ్చిన సినిమాలకి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను వహిస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు నిర్మాణ బాధ్యతను పూర్తిగా తనపైనే వేసుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భారీ హాలీవుడ్ .. బాలీవుడ్ సినిమాలకి యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన ‘లార్నెల్ స్టోవెల్’ ఈ సినిమాకి ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దగ్గరే వరుణ్ తేజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ తో అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించనున్నాడు.
Tags: Varun Tej, Allu Bobby

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *