సచివాలయానికి వెళ్లే దారిలో రాజధాని రైతుల వంటా వార్పు!

హైపవర్ కమిటీ ఎవరి కోసం అని ప్రశ్న
కొనసాగుతున్న నిరసన
భారీగా మోహరించిన పోలీసులు

రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల నిరసన కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైవపర్ కమిటీ ఎవరి కోసమని రైతులు ప్రశ్నించారు. ఈరోజు సచివాలయానికి వెళ్లే మార్గంలో మందడం రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మార్గాన్ని దిగ్బంధం చేశారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు ఈ దారిలో గుర్తింపు కార్డు ఉన్న వారినే అనుమతిస్తున్నారు. మరోవైపు తుళ్లూరులోను నిరసనలు కొనసాగుతున్నాయి. మహాధర్నా ప్రాంగణం వద్ద అంబేడ్కర్, మోదీ చిత్రపటాలతో రైతులు ధర్నాలో కూర్చున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్న కొందరు మంత్రుల తీరును తప్పుబట్టారు.
Tags: Amaravathi, Farmers Dharna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *