తాత, నానమ్మ పేరుతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించి ఇస్తా : మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : మోహినికుంటలో మా తాత, నానమ్మ పేరుపై సొంత ఖర్చుతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించి ఇస్తానని ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ హామీనిచ్చారు. రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్‌ మండలం మోహినికుంట జరిగిన గ్రామసభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. పల్లెలు బాగుపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ మాటలను నిజం చేయాలి. సిరిసిల్ల శివారుకు మిడ్‌మానేరు జలాలు చేరుకున్నాయి. రాబోయే మూడు నెలల్లో 12వ ప్యాకేజీ నుంచి నీరు తెప్పిస్తామన్నారు కేటీఆర్‌. సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌కు వెళ్లే ప్రధాన కాలువ నుంచి ఏడు గ్రామాలకు నీరందిస్తామని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు గ్రామాల మంత్రి, తాను పట్టణాల మంత్రిని కాబట్టి అభివృద్ధిలో తమ ఇద్దరికే పోటీ ఉంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *