ఆంధ్ర ప్రదేశ్ లో ఓ మండల తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ కావడం తో అక్కడ మరో కేసు నమోదు కాగా విధినిర్వహణలో అతని ద్వారా కరోనా ఎంతమందికి సోకిందని విషయాన్నీజిల్లా యంత్రాంగామ్  ఆరాతీస్తూ వాళ్ళఅందరిని క్వారంటైన్  కు  పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అధికారులు.అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు.అయితే ఆ తహసీల్దార్ ద్వారా  మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కి వైరస్ అంటుకుంటుందనే అనుమానం తో ఎమ్మెల్యేని హోమ్ క్వారంటైన్ లోకి పంపారు.

వివరాల్లోకి వెళితే హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్‌ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకాలేదు. దీంతో నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు నిర్ధారించారు. అనంతరం తహసీల్దార్‌ను అనంతపురంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు తహసీల్దార్‌ డ్రైవర్‌, అటెండర్‌, కార్యాలయ సిబ్బంది చిరునామాలను అధికారులు సేకరించారు. సిబ్బందిని వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యలపై ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నిర్వహించిన సమీక్షకు తహసీల్దార్‌ హాజరైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఎమ్మెల్యే సైతం క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తానికి తహసీల్దార్కు కరోనా సోకడం తో అతని కుటుంబ సభ్యులు అతన్ని పరీక్షించిన డాక్టర్లు అతని వ్యక్తిగత సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

You Might Also Like