లాక్‌డౌన్‌ నిబంధనలు మరో తొమ్మిది రోజులు మాత్రమే ఉంటాయని, అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ కోరుతుండగా ఆ తరువాత లాక్ డౌన్  ఏత్తివేస్తారనే సంకేతాలు ఆ మాటల్లో స్ఫురించడం తో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సంతోషం  వ్యక్తమవుతోంది. నిజం గా డిజిపి చెప్పినట్లు ఈ తొమ్మిది రోజులే లాక్ డౌన్ ఉంటుందా ఆ తరువాత ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయాలనుకుంటుందా అనే సందేహాలు వాళ్లలో కలుగుతున్నాయి.అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న ఈ తరుణం లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత ప్రమాదం ఉండ వచ్చనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది.అయితే డిజిపి మాటల్లోని ఆంతర్యం తెలియాలంటే మరో తొమ్మిది రోజులు ఆగాల్సిందే.

కాగా ఇదే స్ఫూర్తితో ప్రజలు మరిన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని అయన కోరుతూ కరోనాను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన వారిని అభినందించారు.గుంటూరు, విజయవాడ పోలీసులు మరింత కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, గుంటూరులో 30 మంది కరోనా బాధితులు ఉండగా, కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనా సోకిందని ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించరని అయన వ్యాఖ్యనించారు.ప్రస్తుతం లాక్ డౌన్ ద్వారా ఎదుర్కుంటున్న సమస్యలు,నష్టాల్లో ఉన్న రాష్ట్రము లో మరిన్ని రోజులు లాక్ డౌన్ పెట్టడం సరి కాదని ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం మేరకే అయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు  భావిస్తున్నారు.రాష్ట్ర పోలీస్ బాస్ మాటల్లోని ఆంతర్యం ఏమిటో మరో తొమ్మిది రోజుల వరకు ఆగితే గాని తెలియదు. 

You Might Also Like