గ్యాస్ లీకేజీ ప్రాంతం నుండి ప్రజలను తరలించాలని  బాధితులను వెంటనే వైద్య సేవలు అందిస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ లీక్ దుర్ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసు కున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


You Might Also Like