చేతులు కాలాకా ఆకులూ పట్టుకున్న చందం గా ఎట్టకేలకు ప్రసిద్ధ పుణ్య  క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం లో బయటపడ్డ భారీ అవినీతిపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ నేతృత్వంలో విచారణ కమిటీని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు  ఆదేశాలు జారీ చేశారు. రామచంద్ర మోహన్‌ వెంటనే శ్రీశైలం వెల్లి విచారణ జరపాలని బాద్యులపై చర్యలు తీసుకోవాలని   కమిషనర్‌ అర్జునరావు ఆదేశించారు.ఈ విచారణలో విచారణాధికారి రామచంద్ర మోహన్ కు సహకరించాలని శ్రీశైలం ఈవో కె.ఎస్‌.రామారావుకు ఆలయ సిబ్బందికి సూచిస్తూ సహక రించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరో వైపు శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈ.ఓ రామారావు  ఫిర్యాదు మేరకు దేవాలయం లో దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కుంభకోణంపై శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ చేయడానికి ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.కాగా రూ.76 లక్షల అవినీతిలో 14 మంది, రూ.66 లక్షల అవినీతిలో ఆరుగురిపై మోసం, ఐటీ చట్టం కింద టికెట్ల కుంభకోణంపై శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు


బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది సుమ్మారు రూ.1.42 కోట్లను స్వాహా చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు తెలిపారు. కంప్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌ను మార్చి రూ.150 దర్శనం టిక్కెట్లు, అభిషేకం టిక్కెట్ల సొమ్మును పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఈవో స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ చేయాలని సహాయ కార్యనిర్వాహణాధికారి హరిదాసును ఈవో ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో సర్వర్‌ రూమ్‌ సిబ్బంది నిపుణుల సహకారంతో ఈ అక్రమాలను బయటపెట్టారు. అయితే పొరుగు సేవ సిబంది తో పాటు దేవాలయంలో పనిచేసే పెద్ద తలకాయలే అందలేనిది ఇంత మొత్తం స్కామ్ జరగదని దీనిపై విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

You Might Also Like