ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో 44 కరోనా అనుమానిత కేసులు ఉన్నాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయని ఇందులో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా బాధితుల కోసం 88 ఆసుపత్రులు సిద్ధం చేశామని, 9,352 బెడ్లు అందబాటులో ఉంచామని వివరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. దుకాణాల్లో నిత్యావసరాల ధరలు పెంచితే క్రిమినల్ చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.

You Might Also Like