సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్షం.ప్రపంచాన్ని భయపెడుతున్నకరోనా వైరస్‌కు  మిథనాల్ సేవించడమే విరుగుడు అని దానిని తాగిన సుమారు 500 మంది మరణించినసంఘటన ఇరాన్  దేశంలో జరిగింది. వైరస్ కు మందు కనుక్కోవడానికి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలుతీవ్రంగా ప్రయత్నిస్తుండగా  మిథనాల్‌తో కరోనా వైరస్‌నుఅరికట్టించ వచ్చు  సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరలయ్యాయి.

ఈ తప్పుడు వార్తలను నమ్మిన కొంతమంది మిథనాల్ తాగారు. అయితే ఇది శరీరానికి మంచిది కాదు. దీంతో మిథనాల్ తాగిన 500 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1100 మంది వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. ఈ ఘటనలపై స్పందిస్తూ  అధికారులు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


You Might Also Like