పశ్చిమగోదావరి జిల్లాలో  పెంటపాడు మండల పరిధిలోని అలంపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు.తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం  గుంటూరు నుంచి తణుకు వైపు స్పిరిట్‌ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌ రహదారికి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్‌, క్లినర్‌  సజీవదహనమయ్యారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You Might Also Like