గురువారం వేకుఫ్ జామున జరిగినట్లు గానే  మరో సారి రాత్రి విశాఖలోని  గోపాలపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం ఎల్‌.జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి  మరోసారి భారీగా పొగలు వెలువడుతుండటం తో పాటు పరిశ్రమ సమీపంలోని ప్రాంతాలలో ఘాటైన  రసాయన వాసన ఎక్కువవడము  తో మల్లి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.మరో వైపు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి మరోసారి గ్యాస్ లీకైనట్లు వార్తలు అర్థ రాత్రి దాటాక పుకార్లు చెలరేగడం తో  జనం ప్రాణ భయంతో ఇళ్లు విడిచి రోడ్ల వెంట పరుగులు తీసారు.సింహాచలం, గోపాలపట్నం, పినగాడి ప్రాంతాలకు చెందిన ప్రజలు  బైకుల మీద కారు, ఆటో లాంటి వాహనాలలో  ప్రజలు   గాజువాక వైపు తరలి ళ్లారు.పోలీసులు కూడా  కొన్నిచోట్ల స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.

చేసేదేమీలేక ప్రజలు ఉన్న పళంగా బయటకు వచ్చేశారు. ఆటోలు, ద్విచక్రవాహనాలతో ప్రభావిత ప్రాంతానికి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.కాగా పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వాయువు గాఢతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతుందగా   వాయువు వాసన మాధవధార వరకు వ్యాపించింది. దీంతో పలుచోట్ల ప్రజలు సొమ్మసిల్లి పడిపోతున్నట్లు సమాచారం.గ్యాస్ లీకేజీ ప్రభావం 24 గంటల పాటు ఉంటుందని నిపుణులు తెలుపగా ప్రమాద స్థలి నుంచి లీకేజీ పూర్తిగా ఆగిపోయిందనే విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఎంఏ బృందాలు పాల్పంచుకున్నాయి. గ్యాస్ లీకేజీని ఆపడానికి యాంటీడోస్ ప్రయోగిస్తున్నారు. మరో వైపు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక బృందం రసాయనాలు తీసుకొచ్చింది. ముంబయి, పుణె, నాగపూర్‌ నుంచి కార్గో విమానంలో  విశాఖ విమానాశ్రయానికి చేరుకుని తమ పనిని ప్రారంభించాయి.అలాగే  లీకైన విషవాయువు స్టైరీన్‌ ప్రభావాన్ని తగ్గించే 500 కిలోల పీటీబీసీ రసాయనం పంపాలని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీని ఏపీ సీఎం జగన్‌ కోరగా వారు  కూడా విషయాకా చేరుకొని తమ పనిని మొదలు పెట్టినట్లు సమాచారం.

గ్యాస్‌ దుర్ఘటనలో ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ప్రకటించగా ప్రాణాలు కోల్పోయినవారిలో 10 మంది మృతదేహాలకు    కేజీహెచ్‌ శవాగారంలో  ఈరోజు  శవపరీక్ష నిర్వహిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌ తెలిపారు. అలాగే, విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో 316 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 193 మంది గ్యాస్‌ లీక్‌ బాధితులకు చికిత్స జరుగుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 66 మంది బాధితులు,  గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో 57 మందికి చికిత్స జరుగుతోంది.అయితే ఎల్‌.జి పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో విడుదలైన గ్యాస్‌ లీకేజీ ప్రభావం ఒక కిలోమీటరు పరిధిలోనే ఉంటుందని కిలోమీటర్‌ పరిధి కంటే వెలువల ఉన్నవారు ఆందోళన చెందవద్దని నగర పోలీస్‌ కమిషనర్ తెలిపారు.

శుక్రవారం ఉదయం వరకు  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 మందికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.మొత్తానికి గురువారం ఉదయం నుండి విశాఖ ప్రజలు ఈ ఉపద్రవం తో తీవ్ర మనోవేదనకు గురవడం బాధాకరం.

You Might Also Like