లాక్ డౌన్ నేపత్యంలో తిరుమల లో  ప్రస్తుతం కొనసాగుతున్న విధం గానే మరో 15  రోజులు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించ కూడదని టిటిడి నిర్ణయించింది. ఏప్రిల్‌ 14 వరకు స్వామివారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని, భక్తులను దర్శనానికి అనుమతించబోమని టిటిడి ప్రకటించింది. ఇప్పటికే రెండు కనుమ రహదారులను దేవస్థానం అధికారులు మూసివేశారు. తితిదే సిబ్బంది తిరుమలలో వారం రోజుల పాటు షిఫ్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. తిరుపతిలో 50 వేల మందికి దేవస్థానం తరఫున ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌ 2న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా తితిదే రద్దు చేసింది. స్వామివారి వార్షిక వసంతోత్సవాలను కూడా కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది.మొత్తానికి శ్రీవారిని దర్శించాలంటే మరో 15  రోజుల తరువాత వెలువడే నిర్ణయం వరకు వేచి చూడక తప్పదు.

You Might Also Like