తిరుమల ఆలయాన్ని కొన్ని వేల సంవత్సరాల తరువాత కరోనా సందర్భం గా ఇప్పుడుమూసివేశారాణి,తిరుమల గర్భగుడిలో దీపం కొండెక్కిందని వస్తున్న సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


తిరుమలలో ఆదివారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2500 సంవత్సరాల తర్వాత  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. ఆలయాన్ని మూసివేయలేదని ,పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా కొనసాగుతున్నాయని అయన  స్పష్టం చేశారు.


కల్యాణాలు జరగడం లేదన్న ప్రచారానికి  సాక్ష్యం గా నిత్యం స్వామి వారి కల్యాణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. నైవేద్యం విషయంలో కూడా జరుగుతున్నా ప్రచారం నిజం కాదని ,తిరుమలలో జరుగుతున్నా  వసంతోత్సవాల సందర్భంగా ఇవాళ ఉదయం మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని,అఞ్ఞితంతులు సంప్రదాయం ఆచారంలా ప్రకారమే పెద్ద జియ్యర్ స్వామీ పర్య వేక్షణలో జరుగుతుండగా  ఇలాంటివి ప్రజలు నమ్మొద్దని అయన సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారిపై  చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని  అయన హెచ్చరించారు.

You Might Also Like