రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది.అది అందరు ఊహించినట్టుగానే పుణ్య క్షేత్రమైన వేములవాడ లోనే నమోదయింది.ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన  వేములవాడ పట్టణంలోని  యువకులలో ఒకరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు  నిర్దారణ  అయినట్లు వైద్యులు తెలుపుతున్నారు.  క్వారంటైన్ లో ఉన్న వారందరిచేస్తున్న పరీక్షల్లో భాగం గా వైద్యులు వీరికి రక్త పరీక్షా చేయగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్  ఉన్నట్లు తెలిసిందని చెబుతున్నారు.కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో వారిని పరీక్షల నిమిత్తం  వారం రోజుల క్రితం  సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .


వారి నుంచి నమూనాలను సేకరించిన ప్రభుత్వ వైద్యులు వాటిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు . 48 గంటల తరువాత వారికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని రిపోర్టు నెగటివ్ వచ్చినట్లు వేములవాడ వైద్యులు డాక్టర్ మహేష్ రావు , సుమన్ మోహన్ రావ్ తెలిపారు . అలాగే వారందరు ఢిల్లీ నుండి వచ్చాక కలిసిన 21  మందిని వదిలి వేయగా ఆ నలుగురిని మాత్రం చెక్కపల్లి లోని క్వారయింటెన్ కు తరలించారు.వైద్యుల ప్రకటన పై అప్పుడే వేములవాడ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు.మరిన్ని పరీక్షలు జరిపించాలని అనుకున్నారు.

ఈ సంఘటనతో వేములవాడ ప్రజలు భయబ్రాంతులకు గురై ఇండ్లల్లోంచి బయటకి వెళ్లడం లేదు.ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు వార్త ప్రచారం కావడం తో రాజన్న సిరిసిల్ల  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.  ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావద్దని వైద్యాధికారి మహేష్ రావు పోలీస్ అధికారులు చంద్రకాంత్ ,శ్రీధర్ లు  సూచించారు. కాగా వైద్య పరీక్షల్లో మొదట లేదని ఆ తరువాత కరోనా ఉందని ఎలా రిపోర్ట్స్ వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.మరో సారి క్షున్నంగా మంచి నిపుణుల చేత పరీక్షా చేయించాలని కోరుతున్నారు.


You Might Also Like