ఆమెది ప్రేమ వివాహం పై గా ముగ్గురు  పిల్లల  తల్లి అయినా మరొకరి మోజులో పడింది మందలించిన భర్తను మట్టు పెట్టాలనుకుంది ప్రియుడితో చెప్పి పథకం ప్రకారం లారీ తో గుద్దించి భర్తను చంపించించింది.ముగ్గురు పిల్లలను అనాదాహాలను చేసి తానూ కటకటాల పాలైంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య తన ప్రియుడితో కలిసి భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది.

పోలిసుల కథనం ప్రకారం కథనం మేరకు కడప జిల్లా పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు గ్రామానికి చెందిన  బాలసుబ్రహ్మణ్యం (35). కు  11ఏళ్ల క్రితం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకలు ప్రేమించి పెల్లిచేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యంకు  వ్యాపారంలో నష్టం రావడంతో తిరుపతి  లో మరో పనికి కుదిరాడు.ఈ సమయం లో ముగ్గురు పిల్లలతో పాటు మదనపల్లెలోనే ఉన్న రేణుక ఓ పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి కె.నాగిరెడ్డితో పరిచయం పెంచుకోగా వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఇటీవల బాలసుబ్రహ్మణ్యం తిరుపతి నుండి తిరిగి మదనపల్లెకు తిరిగి రాగా  తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండటాన్ని గుర్తించి ఆమెను మందలించాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

దీంతో తన భర్త తనను వేధిస్తున్నాడని  అతన్ని చంపాలని  నాగిరెడ్డితో చెప్పి  లారీతో ఢీకొట్టించి చంపేందుకు పథకం వేశారు.  శనివారం రాత్రి బాలసుబ్రహ్మణ్యాని మందులు తేవాలని  బయటకు పంపి ప్రియుడికి ఫోన్స్ చేయగా  లారీతో ఢీకొట్టింఎంచి చంపివేశారు మృతుడి సోదరుడు న్యాయవాది కె.రఘుపతి  ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.  విచారణలో పథకం ప్రకారమే బాలసుబ్రహ్మణ్యంను చంపేందుకు రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి, మరికొందరు పథకం వేసినట్లు బయటపడిందని సీఐ తెలిపారు. రేణుక, నాగిరెడ్డితో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాల్మీకిపురం వద్ద లారీని స్వాధీనం చేసుకున్నారు.హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

You Might Also Like