108 వాహనం లొనే ఓ నిండు గర్భిణీ ప్రసవించిన ఘటన శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్చాపురం మండలంలోని డొంకూరులో జరిగింది.డొంకూరు గ్రామానికి చెందిన ఎండిపల్లి జయలక్ష్మి పురిటి నొప్పులు రావడంతో కోసం108 వాహనానికి సమాచారం అందించారు. ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పురుడు పోసిన ఇఎంటి గోపాలకృష్ణ, పైలెట్ తనూజ్ కుమార్ ను అభినందించారు. అనంతరం తల్లీ బిడ్డలను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు.రెండవ కాన్పు లో జయలష్మిని కాపాడుతూ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.

You Might Also Like