పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఏకంగా

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు ప్రాణహాని ఉందని లోక్సభస్పీకెర్ జిల్లా ఎస్పీలకు లేఖ రాసారు.తనను

చంపుతానని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని కేంద్ర బలగాలతో తనకి రక్షణ కల్పించాలంటూ లేఖలో విజ్ఞప్తి

చేసారు రఘురామకృష్ణరాజు.తనను చంపుతామని బెదిరించినవారి పై  పిరియదు చేసిన స్థానిక పోలీసులు 

పట్టించుకోవడం లేదని లేఖలో స్పీకరుకి వివరించారు.స్పీకరుకి పంపిన లేఖను కేంద్ర హోంమంత్రికి కూడా

పంపినట్టు తెలుస్తోంది.శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ని కలవడానికి ప్రయత్ని 

ఇచ్చానని అప్పటినుండి తన నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.స్వామివారి 

భక్తుడిగా తనలాంటివారు కోరుకున్న విషయాలను మీడియా ద్వారా తెలిపానని వివరించారు.ఇలా బహిరంగంగా

అభిప్రాయాలూ చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతున్న అని 

ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమని బెదిరిస్తున్నారు

అంతకుముందు రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరిజిల్లా ఎస్పీకి కూడా లేఖ రాసారు. 

You Might Also Like