కరోనా ఎఫెక్టో లేక చేతుల పైసల ఆడకనో  బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా త‌గ్గాయి. స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టడం, డాలర్‌ మారకం విలువ పెరగడం, పలు దేశాలు లాక్‌డౌన్‌ల నుంచి సడలింపులు ఇస్తుండటంతో పసిడి ధరలకు బ్రేక్‌ పడింది. 10 గ్రాముల బంగారం ధర 286 తగ్గి 45,905 కి చేరింది. కిలో వెండి ధర 400 తగ్గి 41,558కి చేరింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పసిడి ధరలు ఒడిదుడుకులు కొనసాగినా రానున్న రోజుల్లో పెరుగుతాయని బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు.

You Might Also Like