భారత్‌ లో అధిక జనాభా కు తోడు పేద దేశం కావడం వల్ల  లాక్ డౌన్ తో   సంక్షోభం ఇలాగే కొనసాగితే లక్షలాది మంది జీవనాధారం కోల్పోతారని అయినప్పటి భారత్‌ పనితీరు ఈ రంగం లో  మెరుగ్గా ఉందని, దీంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అయి విజయవంతంగా ముందుకు వెళుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుఆశాభావం వ్యక్తం చేశారు.లాక్ డౌన్ కారణంగా భారత వృద్ధి రేటు ఈ ఏడాది మైనస్‌ లేదా సున్నా స్థాయికి చేరుతుందని  అయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో దేశాలు  2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం లో అతలాకుతలం కాగా అందులోంచి భారత్‌ త్వరగా కోలుకోవడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని అయన తెలిపారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకుంటుందని సుబ్బారావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లక్డౌన్ తో ఆయా రంగాలు నష్టపోతున్న వారికి  ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్న  మూలధనం ఉన్నందున ఇవేమి వారికి ఎఫెక్ట్ కాకపోవచ్చని లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు ప్రజలు  సిద్ధంగా ఉండటం తో పనులు ముందుకు సాగి  ఆర్థిక వ్యవస్థ రికవరీ తొందరగా అవుతుందని  ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా పేద దేశమని అధిక జనాభా కలిగి ఉండటం కారణంగా, సంక్షోభం ఇలాతే కొనసాగితే, లాక్‌డౌన్‌ త్వరగా ఎత్తివేయకపోతే లక్షలాది మంది జీవనాధారం కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

You Might Also Like