లైవ్ లో సోషల్ మీడియాలో మాట్లాడుతున్న సినీ నటి హేమను ఉద్దేశించి ఒకరు ఒక ముద్దు  కావాలని కామెంట్ చేయడంతో హేమ కు తిక్క రేగింది.ఒరేయ్ తిక్క తిక్కగా మాట్లాడితే పళ్ళు ఉడగొట్టి చేతిలో పెడతా ఇలాంటి కామెంట్లు చేస్తే ఇంటికొచ్చి మరీ తంతా  పైకి ఇలా కనిపిస్తాను గాని లోపల మరో క్యారెక్టర్ ఉంది, దాన్ని బయటకు తీయకండి జాగ్రత్త అంటూ  ఆ యువకుడికి హేమ వార్నింగ్ ఇచ్చారు.లాక్ డౌన్ వేళా అభిమానులకు దగ్గరయేందుకు వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పేందుకు నటి హేమ సోషల్ మీడియా లైవ్ లో నెటీజన్స్ అడిగిన పలు  ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.హెల్త్ టిప్స్ ,అలాగే లాక్ డౌన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు  తన ఫ్యామిలీ గురించి చెప్పింది హేమ .నెగటివ్ కామెంట్స్ చేసే వారికి లైవ్ లోనే చీవాట్లు పెడుతుండగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసు ఎంత అని ఒక నెటీజన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అది తెలుసుకొని ఏం చేస్తావ్ రా నన్ను పెళ్లి చేసుకుంటావా? అయినా నాకు 60, 70 ఏళ్ళు ఏమి లేవులే  ఇంటర్ చదువుతున్న పాప ఉందంటూ హేమ కౌంటర్ ఇస్తూనే ఆను నెగటివ్ కు నెగటివ్ అని పాజిటివ్ కు  పాజిటివ్ గా నే సమాధానం ఇస్తానని తెలిపింది.మొత్తానికి హేమ ఆన్ లైవ్ ఆ ఇదం గా మూడు చివాట్లు ఆరు  అరుపులు గా ముగిసింది .


You Might Also Like