కుటుంబం అంటే తనకెంత ఇష్టమో ముఖ్యం గా వారితో  కలిసి ఉండటం తన కెంత ముఖ్యమో  చెప్పకనే చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. తాజా గా సోషల్ మీడియా లో తమ్ముళ్లు, చెల్లెళ్లతో కలిసి గతంలో తానూ తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లాక్‌డౌన్‌కి ముందు ఓ ఆదివారం రోజున ఈ ఫొటో తీసుకున్నాం. ఇష్టపడే వారిని కలవడాన్ని మిస్‌ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా ఇలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాను. ఆ రోజులు మళ్లీ త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను. ఓ ఆదివారం - అమ్మ దగ్గర,  నేను- చెల్లెళ్లు, తమ్ముళ్లు' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫొటోను పోస్ట్ చేశారు.చిరు పోస్ట్ చేసిన ఈ ఫొటోలో చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనా దేవి, తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌, చెల్లెళ్లు మాధవి, విజయ ఉన్నారు. సోషల్ మీడియా లో చిరంజీవి చేసిన ట్వీట్ మెగా అభిమానుల నుండి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది.

You Might Also Like