తానూ సినిమా షూటింగులతో  బిజీ గా ఉన్నానని మరో ఏడాది వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని ఇంత బిజీ షెడ్యూల్ లో పెళ్లి చేసుకోవడం అవసరమా అని  ప్రముఖ నటి కీర్తి సురేశ్ అన్నారు.గత రెండు మూడు రోజులుగా ఇటు ప్రధాన మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తనపెళ్లికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలపై కీర్తి సురేశ్ స్పందించింది. బీజేపీ నేతతో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి ఘనంగా జరగబోతోందని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెదవి విప్పిన కీర్తి ఆ వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది. వదంతులను వ్యాపింప చేయవద్దని కోరింది. మరో ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, అందుకు సంబందించిన షూటింగులతో తానూ బిజీ గా ఉన్నానని ఆమె తెలిపారు.


You Might Also Like