తెలంగాణ ప్రభుత్వం కరోనా పై చేస్తున్న పోరాటం అభినందనీయమని వెటరన్ సినీ  నటి, కాంగ్రెస్ నాయకురాలు  విజయశాంతి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం పట్ల ఆమె తన మద్దతు తెలిపారు. 'ప్రపంచంతో పాటు మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది'.అంటూ ట్వీట్ చేసారు.ప్రస్తుత విపత్తు సమయం లో విజయశాంతి ఈ వ్యాఖ్యలపై ప్రశంసలు వెలువడుతున్నాయి.

You Might Also Like