బాలీవుడ్ లో వరసగావిషాదాలు చోటు చేసుకున్నాయి. విలక్షణ  నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మృతి చెందిన ఘటన క ముందే  మరో నటుడు మరణం బాలీవుడ్ ను కలవరపరుస్తోంది.  అలనాటి స్టార్ నటుడు రిషికపూర్ గురువారం  మృతి చెందాడు.  గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితమే ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.  రిషీ కపూర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించినట్లు ఆయన సోదరుడు రణ్​ధీర్​కపూర్ ​తెలిపారు. చికిత్స కొనసాగుతుండగానే అయన  మృతి చెందారు. రిషీ కపూర్​ గతేడాది సెప్టెంబరులోనే క్యాన్స​ర్​కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్​కు తిరిగి వచ్చారు .అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు తెలుస్తోంది. రిషీ కపూర్‌ హఠాన్మరణంతో బాలీవుడ్‌ మూగబోయింది.  బాలీవుడ్ నటుడు మరణం పట్ల అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

జీవిత చరిత్ర 

అప్పటి దాకా హిందీ సినిమా రంగం లో కొనసాగిన పోకడలను పక్కన పెట్టి అయన తెరంగేట్రం చేసిన మొదటి  సినిమా లోనే హమ్ తుం ఏక్ కమ్రేమే బంద్ హొ అనే బాబీ    సినిమా లోనే పాట తో సంచలనం సృష్టించిన రిషీ కపూర్‌ 1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించారు.ఆయన  ఆర్‌.కె.ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై పలు చిత్రాలు నిర్మించిన బాలీవుడ్‌ దిగ్గజం రాజ్‌కపూర్‌ రెండో కుమారుడు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 1973లో తొలిసారి హీరోగా రిషీ కపూర్‌ బాబీ చిత్రంలో నటించారు. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. మరో 41 చిత్రాల్లో మల్టీ స్టారర్‌ కథానాయకుడిగా నటించారు. బాబీ, లైలా మజ్నూ, సర్గమ్‌, నగీనా, చాందినీ, హనీమూన్‌, దీవానా, గురుదేవ్‌ చిత్రాలు రిషీకపూర్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి.

You Might Also Like