ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయనకు 54 సంవత్సరాలు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పెద్దపేగు వ్యాధి సమస్యతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఆయన మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన క్యాన్సర్ వ్యాధితో కూడా బాధపడ్డాడు. కొన్ని నెలల క్రితం కోలుకున్నాడు. కానీ ఆయనకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇర్ఫాన్ ఖాన్ మరణంతో బాలీవుడ్ తో పాటు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ఆయన మృతికి సంతాపం తెలిపారు.ఇర్ఫాన్‌కు ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి. ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం చనిపోయారు. జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు.

You Might Also Like