విపత్కర పరిస్థితుల్లో తానూ అండగా ఉంటాననీ విలక్షణ నటుడు కమలహాసన్ మరో మారు నిరూపించుకున్నాడు.కరోనా వైరస్‌బాధితులకు చికిత్స అందించేందుకు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చి అందులో రోగులకు తగిన సౌకర్యాలు కల్పిస్తానని  అయన ప్రకటించారు. తన పార్టీ మక్కల్ మయ్యం వైద్యులతో కలిసి తన ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సేవలు అందించేందుకు ఇదే మార్గమని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తన ఇంటిని ఆసుపత్రిగా మార్చేస్తానని కమల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు

You Might Also Like