శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె రాఘ‌వేంద్ర‌రావు త‌న‌ జీవితంలో ఏప్రిల్ 28 అనేది ఎంత ఇంపార్టెంట్ రోజే ఆయనే ప్రత్యేకం గా ఒక లేఖ  రూపం లో వెల్లడించారు. ఆ ఉత్తరం లోని రథ అయన మాటల్లోనే 

నా సినీ జీవితంలో ...


ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక

రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ

ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు.

ఒక్క మాటలో చెప్పాలంటే అది చరిత్ర సృష్టించిన రోజు,


43 ఏళ్ల క్రితం అడవి రాముడు విడుదలైన రోజు.


ఆ నందమూరి అడవి రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా

నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఆ

చిత్ర దర్శకుడిగా చట్టం ఆఫ్‌ ద షిప్‌ గా.. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


"అడవి రాముడు" రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని

ఉదాహరణలు,

4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు. 8 సెంటర్లలో 200 రోజులు. 35 సెంటర్లలో

100 రోజులు. ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌ లో

ప్రతిరోజూ 5 షోష్‌ తో 100 రోజులు ఆడటం మరో విశేషం.


బంగారానికి తావి అబ్దినట్టు ఏప్రిల్‌ 28 నాడే

నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత

ఆనందాన్ని కలిగిస్తోంది. అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి

ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే...


 


 ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తదితర నా

కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.


రెండు పండుగలని ఒకేరోజు అందించిన ఏప్రిల్‌ 28, కరోనా మహమ్మారిని

తుద ముట్టించదానికి వేదికగా మారాలని ఆశిస్తూ...

అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న


వైద్య సిబ్బందికి, పోలీస్‌ విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు


తెలియజేస్తూ

ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలతో భారతదేశం

భవ్య దేశంగా

విరాజిల్లాలని కోరుకుంటూ..


కె. రాఘవేంద్రరావు


You Might Also Like