కరోనా నేపధ్యంలో  యంగ్ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఇటీవలే  హీరో నితిన్ కి డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో వివాహ నిశ్చితార్థం జరిగింది ఇక ఏప్రిల్ 16న  పెళ్లి దుబాయ్‌లోనినిర్వహించాలని అనుకున్నారు. కానీ దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ విస్తరించడంతో లాక్ డౌన్ ఏర్పడి విమానాలు రవాణా వ్యవస్థ రద్దు స్తంభించడం తో వారి  పెళ్లి జరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్ లో నితిన్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా మార్చి 30వ తేదీ తన పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్లు నితిన్ వెల్లడించారు.


"నా అభిమానుల‌కు, తెలుగు ప్రజ‌ల‌కు న‌మ‌స్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో స‌హా దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన‌రోజును జ‌రుపుకోకూడ‌ద‌ని నిర్ణయించుకున్నాను. అందువ‌ల్ల ఎక్కడా కూడా నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుప‌వ‌ద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జ‌ర‌గాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మ‌నమంద‌రం క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టడానికి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

You Might Also Like