ప్రముఖ నటుడు ప్రభాస్ స్వీయ నిర్బంధం లో ఉన్నాడని తెలుస్తుంది .ప్రభుత్వానికి సహరించాలనే ఉద్దేశ్యం తోనే ప్రభాస్ఈ తానె స్వయం గా  క్వారంటైన్ అయ్యాడని 14  రోజుల పాటు ఆయన ఈ నిర్బంధాన్ని కొనసాగించనున్నట్లు  ప్రభాస్సీ పెదనాన్న సినియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు  వెల్లడించారు."మా అబ్బాయి ప్రభాస్, మా అమ్మాయి సాయి ప్రసీద సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. వారిద్దరూ విదేశాల నుంచి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందజేసి స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.


ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తమకు ఎలాంటి అస్వస్థత లేకపోయినా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. అది వారి కనీస బాధ్యత" అని పేర్కొన్నారు. సాయి ప్రసీద కృష్ణంరాజు పెద్ద కుమార్తె కాగా ఆమె ఇటీవలే అమెరికా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. హీరో ప్రభాస్ తన కొత్త చిత్రం కోసం జార్జియాలో షూటింగ్ జరుపుకుని నేరుగా హైదరాబాద్ వచ్చారు.

You Might Also Like