ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూగజీవాలకు బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఆహారం పెట్టేందుకు వీధుల్లోకి వచ్చింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రజలే ఇంటి నుండి బయటకువెళ్ళ లేని దుస్ధితిలో ఉండగా ఈ విపత్కర పరిస్థితిలో మూగ జీవాలను గురించి పట్టించుకునే వారే లేక పోవడంతో తిండిలేక విలవిలలాడాయి.ముఖ్యంగా వీధి కుక్కలు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. వీటి దుస్థితికి చలించిపోయిన రష్మీ గౌతమ్ తానే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కుక్కలకు ఆహారం, నీళ్లు అందించింది. అందరూ సమీపంలో ఉన్న మూగ జీవాలకు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేసింది. రష్మీ పిలుపు మేరకు ఎంత మంది స్పందించి  వాటికి ఆహరమ్    నీరు  అందిస్తారో  చూద్దాం.

You Might Also Like