కన్నడ చిత్రనటి కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ తెలుగు లో అల్లరి నరేశ్ సరసన 'కెవ్వుకేక' చిత్రంలో నటించిన కన్నడ భామ షర్మిలా మాండ్రే ఓ రోడ్డుప్రమాదంలో గాయపడింది. బెంగళూరు వసంత్ నగర్ వద్ద షర్మిల తన స్నేహితుడు లోకేశ్ వసంత్ తో కలిసి ఓ కారులో ప్రయాణిస్తుండగా  ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ స్తంభాన్నివేగం గా  ఢీకొట్టడం తో కారు ముందుభాగం ఓవైపు నుజ్జునుజ్జయింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ వేకువజామున 3 గంటల సమయంలో వీరు బయట ఎందుకు తిరుగుతున్నట్లు ఆ సమయం లో ఎటు వెళ్లి వస్తున్నారన్న విషయాలపై పోలీస్ లు విచారిస్తున్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదైంది. కాగా, గాయాలపాలైన షర్మిల, లోకేశ్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

You Might Also Like