టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నటనా రంగానికి ఎనలేని సేవ అందించిన దేవదాస్ కనకాల-లక్ష్మి దేవి ల కుమార్తె, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల అక్క టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆడపడుచు  శ్రీలక్ష్మీ కనకాల ఈరోజు మృతి చెందారు. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెకు గతంలో క్యాన్సర్ ఎటాక్ కాగా ఆమె మనోస్థైర్యంతో పోరాడి దానిలో నుండి బయట పడ్డారు. శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడం వల్ల నటనకు ఆమె దూరంగా ఉన్నారు. శ్రీ లక్ష్మి కొధ్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటి క్రితమే శ్రీలక్ష్మి మరణించారు. గతేడాది రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు గతంలో ఏపీ మంత్రిగా పనిచేసిన లోకేష్ కి తెలుగు ట్యూటర్ గా కూడా ఉన్నారు వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు.శ్రీలక్ష్మీ మృతి తో కనకాల వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. 

You Might Also Like