లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్సుకు నిర్మాణాంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది.శుక్రవారం తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ను టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారు .సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్.రాజమౌళి,దిల్ రాజు, త్రివిక్రమ్, ఎన్.శంకర్, రాధాకృష్ణ, సి.కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ,తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదురుకొంటున్న కష్టాలను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చారు అదే విధంగా సినీ పరిశ్రమ లోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలు వివరించారు. షూటింగ్స్ కి అనుమతివ్వల్సిందిగా కోరగా,జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతిస్తుంది కెసిఆర్ తెలిపారు.ప్రభుత్వం కోవిద్ 19 మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్రీకరణలు జరపాలని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించారు.చిత్రీకరణల అనుమతి,థియేటర్ల పునః ప్రారంభంపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని కెసిఆర్ పేర్కొన్నారు . 

You Might Also Like