ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు రేడియో మామయ్య గా ఆడదే ఆధారం చిత్రం ద్వారా  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన  విసు కన్నుమూశారు. మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్‌ విసు అసలు పేరు కాగా గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆదివారం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు విసు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయనకి భార్య ఉమ, కుమార్తెలు లావణ్య, సంగీత, కల్పన ఉన్నారు.


విసు మొదట్లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆపై దర్శకుడిగా మారి పలు సినిమాలు తీశారు. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. పలు సినిమాలకు రచయితగానూ పనిచేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేశారు. ‘అరుణాచలం’ సినిమాలోని రంగాచారి పాత్ర (రంభ తండ్రి)  ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై అనేక కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన ‘సంసారం ఒక చదరంగం’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా లభించింది.


You Might Also Like