1. వెజ్ ఆమ్లెట్


కావలసినవి:

చాయ పెసర పప్పు 1 కప్పు, బంగాలాదుంపలు 8, క్యారెట్ 2, బీట్ రూట్ 2, పచ్చిబఠానీలు, గుప్పెడు ,ఉప్పు తగినంత శెనగపిండి 4స్పూన్లు,ఉల్లిపాయలు 2 ,పచ్చిమిర్చి 6

తయారు చేయు విధానం :

పెసరపప్పు గంటసేపు నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.బంగాళా దుంపలు నాలుగు ముక్కలుగా తరిగి ఉడకబెట్టాలి.ఉడికాక వాటిని పైన తొక్క వలిచి మెత్తగా రుబ్బి ఇందాక రుబ్బి ఉంచుకున్న పెసరపిండిలో కలపాలి.ఇప్పుడు శెనగపిండిని చిన్నగిన్నెలోకి తీసుకొని నీళ్ళుపోసి పిండిలాగా కలిపి ఇదికూడా పెసర పిండి లో పోసేయాలి .క్యారెట్, బీట్ రూట్ సన్నగా కోరుకొని, కాసిని నీళ్ళుజల్లి సన్నటి సెగ పైన ఉడికించి, చల్లార్చి నీళ్ళుపిండి పక్కన పెట్టుకోవాలి.బఠాణీలు కూడా ఉడకబెట్టి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు క్యారెట్, బీట్ రూట్ కోరు, బటాని ముద్ద, పసుపు, ఉప్పు, పెసర పిండిలో కలపాలి. ఆమ్లెట్ పిండి రెడీ అయినట్లే!

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకొని ఒక ప్లేటులో ఉంచుకోండి. ఇక స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెసర పిండి అట్లు వేసి ఉల్లికోరు జల్లండి. చుట్టూ నూనె వేయండి.నెయ్యి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ అట్లు తిరగ వెయ్యకూడదు.ఉల్లికోరు దోరగా వేగితే బాగుంటుంది. ఇది మామూలు టిఫిన్ లాగా తినచ్చు. అన్నంలోకి కూడా చేసుకోవచ్చు.


నెయ్యి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ అట్లు తిరగ వెయ్యకూడదు


ఉల్లికోరు దోరగా వేగితే బాగుంటుంది. ఇది మామూలు టిఫిన్ లాగా తినచ్చు. అన్నంలోకి  కూడా చేసుకోవచ్చు.

You Might Also Like