రొయ్యలు - బీరకాయ

కావలసిన సరుకులు - 100 గ్రా రొయ్యలు, 200 గ్రా బీరకాయలు, 25 గ్రా నూనె, 1 ఉల్లి 1 పచ్చిమిర్చి, అరకట్ట కొత్తిమీర, అర చెంచా కారం తగినంత ఉప్పు

చేయు విధానం :- బీరకాయలు చెక్కుదీసి, ముక్కలుగా తరిగి పెట్టు కోవాలి. ఉల్లి, మిర్చి సన్నగా కోసుకోవాలి. నూనె కాచి రొయ్యలు, ఉల్లి, మిర్చి ముక్కలు వేసిన తరువాత బీరముక్కలు, ఉప్పు, కారం వేసి వేగిన తర్వాత కొత్తిమీర జల్లి దింపుకోవాలి.

You Might Also Like