చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన మడిపల్లి కార్తీక్ రోడ్ ప్రమాదం లో మృతి చెందారు.సోమవారం మధ్యాహ్నం కార్తిక్  తన మోటార్ సైకిల్ పై కిరాణం సామాను తీసుకరావడానికి వెల్లుచుండగా, మార్గ మధ్యలో గ్రామం లోని ఎల్లమ్మ గుడి వద్ద తన వెనక నుండి   ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ, మృతుడు బండిని ఓవర్ టెక్ చేస్తూ ఎడమవైపు ఢీకొనడంతో, మృతుడు మేడిపల్లి కార్తిక్ ట్రాక్టర్ ట్రాలీ టైరు క్రింద పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి  తండ్రి శంకరయ్య పిర్యాదు మేరకు, చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like