నిన్న నాలుగు శవాలు దొరికిన బావి లోనే నేడు మరో ఐదు శవాలు గంటకొకటి తేలడంతో   పోలీసులు ఆ శవాలను  వెలికి తీశారు.మొత్తానికి అనుమానాస్పద స్థితిలో తొమ్మిది మంది వలసకూలీలు మరణించడం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.  వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి.నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో 5 మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు, వారితో పాటు మరో ఇద్దరి శవాలు బావిలో ఉండటంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి


ఎండీ మక్సూద్‌  20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గత డిసెంబరు నుంచి గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత నెలన్నర నుంచి గోడౌన్‌లో ఉంటున్నాడు. మక్సూద్‌తోపాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ కుటుంబంతోపాటు బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో ఉంటున్నారు.

ఎప్పటిలాగా యజమాని సంతోష్‌ గురువారం మధ్యాహ్నం గోడౌన్‌కు వచ్చే సరికి కూలీలెవరూ కనిపించలేదు. గోదాం ఆవరణలో కార్మికులు లేకపోవటంతో గుర్తించిన నిర్వాహకులు బావిలో శవాలుగా తేలిన వారిని చూసి గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. ఇక ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మక్సూద్ , అతని భార్య నిషా, కుమార్తె బూస్రా, మూడు సంవత్సరాల వయసున్న బూస్రా కొడుకు , మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం, సోహెల్ ఆలం , షకీల్ గా గుర్తించారు. ఇక వీరితోపాటు బీహార కు చెందిన .శ్రీరాం, శ్యాం లుగా గుర్తించారు.

ఏడుగురు సభ్యులు గల ఈ కుటుంబాన్నిమరో ఇద్దరు  యువకులను  

ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు జిల్లాలో వ్యక్తమవుతున్నాయి.ఇటీవలే మక్సూద్‌ మనవడి బర్త్‌డే వేడుకలు నిర్వహించగా అందులో బిహార్‌ యువకులకు, స్థానిక యువకులకు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మక్సూద్‌ కూతురు వివాహం జరగగా భర్తతో  విడాకులు పొందినట్లుఈ విషయంలోనే ఈ గొడవ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోపార్టీ లో విష ప్రయోగం చేసి కుటుంబాన్ని మత్తులో  ఉండగానే బావిలో పడవేసి ఉంటారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంత మందిలో ఒకరికైనా ఈత వచ్చి ఉండదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మృత దేహాల శరీరాలపై ఎలాంటి గాయాలు లేనందున పోలీస్ లు ఆత్మ హత్య గా కేసు నమోదు చేశారు.You Might Also Like