భార్య భర్తల మధ్య క్షణికావేశం వారి పిల్లలను అనాథలు గా మార్చింది.హైదరాబాద్  లోని  బాచుపల్లి ఠాణా పరిధిలో కుటుంబ కలహాల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనబుధవారం జరింగింది. సీఐ జగదీశ్వర్‌ వివరాల ప్రకారం ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే పి.సురేందర్‌ బిందు దంపతులు నిజాంపేట శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య రెండు మూడు రోజులుగా జరుగుతున్నా గొడవలు ముదిరి ప్రాణాలు తీసుకున్తా దాకా వెళ్లాయి.ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  పైఅంతస్తులోనే ఉంటున్న వీరి  సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలిద్దరూ అనాథలయ్యారని అక్కడి వారు రోదించడం పలువురిని కంటతడి పెట్టించాయి.

You Might Also Like