వాళ్లేమో  వైన్స్ వ్యాపారులు కానీ వాళ్ళ కారుకు పోలీస్ పేరుతో  స్టికర్ లోపల బయట వాళ్లకు కనపడేటట్లు గా పోలీస్ టోపీ ఇంకేముంది అడిగేవాళ్లు లేరు అడ్డగించి వారు లేరు పోలీసులనే అంటూ అక్రమం గా మద్యం తరలించేందుకు వేసిన ఎత్తుగడ విఫలమై పోలీసులకు చిక్కి జైలు కు వెళుతున్న ప్రబుద్దుల కథ ఇది.

వరంగల్ కరీమాబాద్ కు చెందిన రాజుకుమార్,రవి లకు సంబందించిన నర్సంపేటలోని శ్రీనివాస వైన్స్ ఉంది.లాక్ డౌన్ ను మరచిపోయి అడ్డదారిగా డబ్బు సంపందించాలని ఆలోచనతో కారుకు పోలిస్ స్టింకర్ అంటించి,కారులో పోలిస్ టోపి పేట్టి అన్ని చేక్ పోస్టుల దగ్గర పోలిస్ అని చేప్పుకుంటు నర్సంపేటకు వేళ్ళి అర్దరాత్రి సమయంలో ఏవరు లేకుండా చూసి శ్రీనివాస వైన్స్ షాపు తాళం తీసి అందులో నుండి మద్యం బాటిల్ కారులో పేడుతుండా పేట్రోలింగ్ చేస్తున్న పోలిసులకు ఆకస్మతుగా పట్టుపడ్డారు.ఇద్దరితో పాటు కారు,మద్యం అదుపులో తీసుకోని నర్సంపేట పోలిస్ స్టేషన్ కు తరలించారు.అయితే తానున్నాననే  దైర్యం చెప్పి ఓ పోలీస్ అధికారి వీరి వెనుక ఉంది ఈ కథ నడిపించినట్లు పుకార్లు వినపడుతుండగా వరంగల్ పోలీస్ కమిషనర్ దీనిపై విచారణ జరిపి బాద్యులను శిక్షలని పలువురు కోరుతున్నారు.

You Might Also Like