మూడ నమ్మకాలు వారి పాలిట శాపం గా మారాయి.చేసేది సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అయినా చేతబడి తమను వేధిస్తోందని భావిస్తూ హై దరాబాద్‌ శివారు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధి అల్మాస్‌గూడలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి చెందిన నలుగురు అర్దాంతరంగా జీవనం చాలించారు.బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మృతుల్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరీశ్, ఆయన కుటుంబ సభ్యులుగా గుర్తించారు.వీరంతా  వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం దోర్నాల గ్రామానికి చెందిన వారీగా గుర్తిచారు.

వీరు అల్మాస్‌గూడలోని బీఎస్‌ఆర్‌ కాలనీ శ్రీసాయితేజ అపార్ట్‌మెంట్స్‌లో గత రెండేళ్లుగా నివసిస్తున్నారని తల్లి సువర్ణ ,కుమార్తె స్వప్న ఇంట్లో ఉంటుండగా కుమారులు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తారని స్థానికులు తెలిపారు.అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివసిస్తున్న వీరు గత రెండు రోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా, ‘ ప్లీజ్ ఓపెన్ ది డోర్ ’ అనే కాగితం అతికించి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు తెరిచి చూడగా కుటుంబ సభ్యులు నలుగురు విగత జీవులుగా కనిపించారు.


అపార్ట్మెంట్ బెడ్‌రూంలో మంచంపై తల్లి సువర్ణబాయి మృతదేహం ఉండగా దానిపక్కనే స్వప్న, గిరీశ్‌ మృతదేహాలు ఉన్నాయి. వేరే గదిలో హరీశ్‌రావు మృతదేహం ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. కిచెన్‌, బెడ్‌రూంలో వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న వారిని ఒకే గదిలో పెట్టి ఆ తర్వాత హరీశ్‌రావు ఆత్మహత్య చేసుకున్నట్లు క్రైం సీన్ తెలియ జేస్తుండగా వారంతా ఆత్మహత్య చేసుకోవాలని కొన్ని రోజులుగా యత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

హరీష్ శవం పక్కన ధోరికిన ఒక లేఖలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తమపై కొందరు చేతబడి చేస్తుండటం తో తాము  ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఏ దారి లేక చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నాం అని పేర్కొంటూ మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయొద్దని మమ్మల్ని నేరుగా అంతక్రియలకు తీసుకెళ్లండి ఇదే మా చివరి కోరిక’ అని రాసి చనిపోవడం పలువురిని కంటతడిపెట్టించింది.ఎల్బీ నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అయన సూచనల మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వారి ఫోన్ ఆధారంగా పోలీసులు వారి బంధువులకు సమాచారం అందించారు. 

  1. మరిన్ని ఆసక్తికరమైన వార్తలకు ఇక్కడే దీనిపైనే క్లిక్ చేయండి ధన్యవాదాలు click here click me

You Might Also Like