అక్రమ సంబంధమే ఓ వ్యక్తి నిండు  ప్రాణాలు బలిగొంది.ఒకసారి ప్రత్యర్థుల దాడి నుండి తప్పించుకొని బయట పడిన రెండవ సారి వారు   పకడ్బందీగా పథకం ప్రకారం మాటు వేసి గొడ్డళ్లతో దాడి చేయడం తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన జగిత్యాల  జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి  వెళితే  జిల్లా లోని మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేందర్ (28) అనే వ్యక్తిని మంగళవారం ఉదయం నడిరోడ్డుపై  కొందరు మాటు వేసి హత్య చేశారు.వేంపేటకు చెందిన ధనరేకుల రాజేంధర్ అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు.

సదరు మహిళ భర్త జల్ల రమేష్ విదేశాల్లో ఉండగా ఈ  సంబంధం కొనసాగగా ఈ  మధ్యనే స్వగ్రామానికి చేరుకున్న రమేష్ కు   భార్య అక్రమం సంబంధం గురించి తెలియడంతో తమ్ముడు జల్ల మహేష్ తో కలిసి ను కలసి రాజేందర్ ను  చంపాలనే   పథకం రూపొందించారు.ఈ మేరకు మార్చి 3న వేంపేట శివారులో రాజేందర్ ‌పై రమేష్ కత్తులతో దాడి చేశాడు.అయితే అదృష్టం రాజేందర్ వైపు ఉండటం తో అయన తృటిలో తప్పించుకుని   గాయాలతో బయటపడ్డాడు. దీంతో మెట్‌పల్లి పోలీసులు హత్యయత్నం కేసులో జల్ల రమేష్ ను రిమాండుకు తరలించగా నెలక్రితం బెయిలుపై విడుదలయ్యారు.


తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజేండర్ ను ఎలాగైన చంపాలని కసి పెంచుకొని అదును కోసం చూస్తున్న రమేష్,అతని తమ్ముడు  మహేష్ లకు మంగళవారం రాజేందర్   వేంపేట శివారుకు చేరుకోగా శివారు ప్రాంతంలో కాపు కాసిన అన్నదమ్ములు ఇద్దరు రాజేండర్‌పై గొడ్డలి దాడి చేసి చేతులపై  మణికట్టులపై, మెడపై నరకడంతో అయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న డిఎస్పీ గౌస్ బాబా సి.ఐ. రవికుమార్, ఎస్.ఐ. సదాకర్ లు హుటాహుటిన సంఘటణ స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. మృతుని భార్య హరిణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి. తెలిపారు. మృతుడు రాజేందర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.నిందితులను త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ గౌస్ బాబా సి.ఐ. రవికుమార్తెలిపారు.కాగా హత్య చేసిన అనంతరం నిందితులు పోలీస్ లకు లొంగిపోయినట్లు సమాచారం.

You Might Also Like