పనికి బద్దకిస్తు భార్యనునిత్యం వేదిస్తున్న ఓ భర్తను అతని భార్యతన ఇద్దరు కుమారులతో కలిసి హతమార్చిన ఘటన ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్‌ జిల్లా లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంజిల్లాలొని నందిపేట మండల కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో  గంధం రమేష్‌(41), పద్మ దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. పని చేయమంటే ఒక రోజు చేయనని మరొక రోజు లాక్ డౌన్ లో పని లేదని ఇంకొక రోజు తనను పని చేయమంటారా అంటూ భార్య పిల్లల పై దాడికి దిగుతున్న భర్త తో అవస్థపడలేని ఓ భార్య తన తన మంగళ సూత్రాన్ని తానె తెంపుకునేందుకు సిద్దమయింది.

గతకొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.మేస్త్రీ పని చేసే రమేశ్‌ ప్రతిరోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో భార్యను కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. శనివారం సాయంత్రం కూడా తాగి ఇంటికి వచ్చిన రమేశ్‌ ఇంట్లో గొడవకు దిగాడు. రోజురోజుకూ భర్త వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేని పద్మ భర్త రమేశ్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఫుల్లుగా తాగి ఆరు బయట మంచంపై పడుకుని ఉన్న రమేశ్‌ మెడకు కొడుకుల సహాయంతో వైరు చుట్టి భార్య పద్మ హత్య చేసింది. అనంతరం తనే హత్య చేశానని పోలీస్‌ స్టేషన్‌లో ఇద్దరు కొడుకులతో కలిసి లొంగిపోయింది. దీంతో ఆర్మూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సై రాఘవేందర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రమేశ్‌ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You Might Also Like