రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి బస్టాండ్ సమీపంలోని మూల మలుపు వద్ద ఆదివారం  సాయంత్రం 5-౦౦ గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దుబ్బాక దేవరాజ్ ముదిరాజ్  తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రాగట్లపల్లి బస్టాండ్ మూలమలుపువద్ద కోర్రే మల్లయ్య ఇంటి ముందు గల ప్రదాన రహాదారిపై జరిగిన యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను గ్రామస్థులు వెల్లడించారు.


ఆదివారం సాయంత్రం 5 .00 గంట ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల వైపు వెళుతున్న లారీనీ సిరిసిల్ల నుంచి గంభీరావుపేట వైపు ద్విచక్రవాహనం నెంబర్ ఏ పి 23 ఏ.బి.9794 నెంబర్ పై  గంబీరావుపేటకు చెందిన దుబ్బాక దేవరాజ్ ముదిరాజ్ వెళుతూ లారీ నీ డీ కొట్టాడు. ఈ సంఘటనలో బైక్ పాడైంది దేవరాజ్ ముదిరాజ్ తల కు బలమైన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి 108 వాహానంలో ఏల్లారెడ్డిపేట పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

You Might Also Like