మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో దారుణం చోటు చేసుకుంది . భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదాలు ఇద్దరు చిన్నారులను బలికొన్న ఘటన పలువురిని కలిచివేసింది.భర్త వేధింపుతాళలేక  ఓ భార్య తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి, తానూ తాగిన ఘటన శామీర్‌పేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ సంతోశం తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరు మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్‌ తుర్కపల్లి బయోటెక్ జీనోమ్ వ్యాలీలోని ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యల కారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏదో విషయమై దంపతులిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రీతి బుధవారం తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వారిని మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట ఎస్సై గణేశ్ తెలిపారు.

ఆదర్శం గా బతకాలనుకున్న ..

ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న  గోపీనాథ్ తన జీవితాన్ని ఆదర్శ వంతంగా తీ ర్చిదిద్దు కోవాలను కున్నాడు.ఆ భావాలతోనే  ఒక అనాథ అమ్మాయికి జీవితంలో చోటివ్వాలని లనుకుని అనాథ శరణాలయానికి వెళ్లి ఓ అనాధ అమ్మాయి అయినా  ప్రీతి ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. భార్య  ప్రీతిని చిన్నతనంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలిపెట్టి వెళ్లిపోగా ఆమెను ఓ అనాధ శరణాలయం పెంచి పెద్ద చేశింది. అయితే పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు బాగానే సంసారం సాగింది.  పరిస్థితుల ప్రభావంతో అర్థిక సమస్యలకు తలవోగ్గి భార్యతొో గొడవపడేవాడని తెలిసింది.జరిగిన కొన్ని తగాదాల వల్ల ఆమె పలుమార్లు అనాధ శరణాలయానికి వెళ్ళేది. కానీ పదే పదే గొడవలు జరగడంతో విసుగు చెందిన ప్రీతి తన లాగే తన పిల్లలు అనాథలుగా పెరగకూడదనే ఉద్ద్యేశ్యంతోనే పిల్లలకు విషమిచ్చి తానూ తాగినట్టు తెలుస్తుంది. అయితేభార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు బలికావడం పలువురిని కలిచివేసింది.

You Might Also Like